మంద కృష్ణ.. “మాదిగ ద్రోహి”

మంద కృష్ణ.. “మాదిగ ద్రోహి”
జాతి ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు
షాద్ నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు “ఎర్రోళ్ల జగన్” ధ్వజం
మాదిగల ప్రధాన శత్రువు బీజేపీనే అన్న మంద కృష్ణకు ఇప్పుడు ఆ పార్టీ ఎలా దోస్త్ అయిందని షాద్ నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఎర్రోళ్ల జగన్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఏర్పాటుచేసిన ఎస్సీ సెల్ సమావేశంలో ఎర్రోళ్ల జగన్ తో పాటు ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు నాగిళ్ల సాయిలు, కొందుర్గు మండల అధ్యక్షులు నరేందర్, కేశంపేట మండల అధ్యక్షుడు భాస్కర్, నందిగామ మండల అధ్యక్షుడు అంతయ్య, చౌదరి గూడెం మండల అధ్యక్షుడు రవికుమార్, పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన మందకృష్ణ..
జాతి ద్రోహి అని మండిపడ్డారు. ‘బీజేపీకి తాకట్టు పెట్టబడుతున్న మాదిగ జాతిని కాపాడుకుందాం’ అని ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి అమ్ముడుపోయిన మందకృష్ణ అహంకారాన్ని దించి బిజెపికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వర్గీకరణకు కమిటీ వేస్తామన్న ప్రధాని మోదీ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి పది సంవత్సరాలు దాటిన ముఖం చాటేసిన బిజెపికి మందకృష్ణ తొత్తుగా మారారని ఘాటుగా విమర్శించారు.
వర్గీకరణ పై బిజెపి ఎన్నోసార్లు ప్రకటనలు చేసి మోసం చేసిందని అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందే ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు. వర్గీకరణ పేరుతో మాదిగలకు బిజేపి మోసం చేసిందని అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి మాదిగలను వర్గీకరణ పేరుతో మరోసారి మోసం చేసేందుకు ముందుకు వస్తోందని దీనిని మాదిగ బిడ్డలు ఎవరు నమ్మకూడదని పిలుపునిచ్చారు. బిజెపి రాబోయే ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమని మాదిగలకు హెచ్చరించారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాబోయే రోజుల్లో సంకట పరిస్థితులు ఏర్పడతాయని బిజెపి ప్రభుత్వం ఏర్పడితే ఈసారి దేశం సమైక్యత భావం కూడా దెబ్బతింటుందని అన్నారు. దేశ సామరసేతను కాపాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు. మాదిగ జాతిని అడ్డం పెట్టుకుని మందకృష్ణ ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నాడని మాదిగ జాతి మందకృష్ణ వెనుక లేదని అన్నారు..