శంషాబాద్ లో ఓ ఆర్ ఆర్ పై ప్రమాదం వ్యక్తి మృతి

కేసు నమోదు చేసిన పోలీసులు


శంషాబాద్ ఓఆర్ ఆర్ పై ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని ఓ ఆర్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదంతో ఓ వ్యక్తి మృతి చెందడం జరిగిందని తెలిపారు. వివరాల్లోకి వెళితే మృతుడు గ్రామం పల్లెర్ల మద్దూరు నారాయణపేట నుంచి బతుకుతెరువు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి 2013లో నార్సింగ్ పరిధిలోని ఇబ్రహీం బాగ్ లో నివాసము ఉండేవారని అక్కడి నుంచి నాలుగు నెలల క్రితం శంషాబాద్ లోని రాజీవ్ గృహకల్ప కి వచ్చి అక్కడే ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారని తెలిపారు.. అయితే శనివారం అనగా తేదీ 08.03.2025 నాడు మధ్యాహ్నం 12:30 గంటలకు పిర్యాది తండ్రి అయినా సయ్యద్ మహబూబ్ ఆలీ షాదనగర్ లో పని ఉంది వెళ్లి వస్తా అని చెప్పి తన బైక్ (హోండా షైన్ టి ఎస్ 13ఈ ఎం 6272) పైన వెళ్ళినాడు. పిర్యాది తండ్రి మహబూబ్ కి రోజు కళ్లు తాగే అలవాటు ఉందని . అయితే తేదీ 08.03.2025 నాడు సమయం రాత్రి 10:00 గంటలకు పిర్యాదికి వరుసకు బావ అగు ఎం ది కాలీద్ పిర్యాదికి ఫోన్ చేసి మీ నాన్న తొండుపల్లి పరిధిలో గల ఓ ఆర్ ఆర్ రోడ్డు పై ఆక్సిడెంట్ అయి చనిపోయినడని టోల్గేట్ సిబ్బంది సమాచారంఅందించారు. వెంటనే పిర్యాది వెళ్లి చూడగా పెద్దగోల్కొండ నుండి తొండుపల్లి వచ్చే ఓ ఆర్ ఆర్ రోడ్డు పై డివైడర్ దగ్గర రక్తగాయలతో మహబూబ్ ఆలీ చనిపోయి ఉన్నాడు. పిర్యాది టాల్గేట్ సిబ్బంది ని ఈ ప్రమాదం ఎలా జరిగింది అని అడుగగా పిర్యాది తండ్రి అగు సయ్యద్ మహబూబ్ ఆలీ టోల్గేట్ సిబ్బంది వద్దని చేప్పిన వినకుండా సాయంత్రం 09:00 గంటలకు తొండుపల్లి తోల్గేట్ నుండి తన బైక్ పైన ఓ ఆర్ ఆర్ రోడ్డు పై పెద్దగోల్కొండ వైపు వెళ్లి మరల తిరిగి ఓ ఆర్ ఆర్ రోడ్డు పై పెద్దగోల్కొండ నుండి తొండుపల్లి వైపు రాంగ్ రూట్లో తన బైక్ ని అజాగ్రత్తగా, ప్రమాదకరంగా నడుపడం తొ ఏదో గుర్తుతెలియని వాహనానికి ముందు నుండి డివైడర్ దగ్గరగా టక్కరు ఇవ్వగ పిర్యాది తండ్రి సయ్యద్ మహబూబ్ ఆలీ కి కుడి కాలు, పొట్ట భాగంలో బలమైన రక్తగాయాలు అయ్యి అక్కడే చనిపోయాడని పిర్యాదికి తెలిపినారు. తోల్గేట్ ఎంట్రీ సి సి పూటేజ్ ని చూయించడం తొ పిర్యాది జరిగిన విషయం మాకు తెలిపి ఇట్టి విషయం పైన తగు చర్య తీసుకోవలసిందిగా పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము మని తెలిపారు.

You may also like...

Translate »