మల్లు రవి ని భారీ మెజార్టీతో గెలిపించాలి
మల్లు రవి ని భారీ మెజార్టీతో గెలిపించాలి
కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి
మహేశ్వరం, జ్ఞాన తెలంగాణ

కల్వకుర్తి నియోజవర్గం మాడ్గుల మండలలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, కల్వకుర్తి శాసనసభలు కాశిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో బిజెపి వారు బిఆర్ఎస్ దోపిడి పాలన తో విసిపోయారని తెలిపారు,
అదే క్రమంలో గడిచిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు మహాలక్ష్మి, రైతు భరోసా, ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్,యువ వికాసం హామీలను మొన్న జరిగిన తుక్కుగూడ తెలంగాణ జన జాతర సభలో 5 నయా పథకాలు ప్రజలు గుర్తించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ఆన్నారు.
అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి మన ప్రియతమ నాయకుడు మల్లు రవి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.