పాపన్న గౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా మల్లేష్ గౌడ్


జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, ఆగస్టు 15 :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 18న నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ ను ప్రభుత్వం నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. తన నియమకానికి సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పాన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, గౌడ్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గట్టు రామచంద్రరావు, మాజా మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూదిడ బిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, కార్పోరేషన్ మాజీ పల్లె రవికుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు

You may also like...

Translate »