మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసిన మల్హర్ రావు దళిత నాయకులు

మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసిన మల్హర్ రావు దళిత నాయకులు

జ్ఞాన తెలంగాణ, మల్హర్ రావ్, సెప్టెంబర్ 25:

గత ప్రభుత్వం హయాంలో దళిత బంధు పథకాన్ని పొందిన లబ్ధిదారులు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాదులో ప్రొసీడికులు వచ్చి డబ్బు మంజూరై జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా తమ పథకం అమలు కాకుండా పోయిందని వీరు మంత్రికి గత ప్రభుత్వం దళితులను ఎన్నికల కోసం వాడుకోవాలని చూసిందని ప్రభుత్వాలు ఏవి ఉన్నా దళితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని మంథని నియోజకవర్గం లోని దళిత బంధు లబ్ధిదారులు విజ్ఞప్తి చేశారు. దళిత బంధు పథకం సమస్య ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదని,,రాష్టవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి ఆలోచన చేసి సరైనా నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు దళిత నేతలకు తెలిపారు. సరైనా సమయంలో మంచి నిర్ణయం తిసుకునే అవకాశం ఉన్నదని తేలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్హర్, మహదేవపూర్, కాటారం, పలిమెల దళితబందు నాయకులు పాల్గోన్నారు. భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు దళిత బంద్ సాధన సమితి అధ్యక్షులునౌల సంపత్, వేమునూరి జక్కయ్య, పులి రామన్న, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చకినారపు చందు, జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శ దుర్గం గుణవంతు, జనగామ రాజేష్,మంచినీళ్ల శ్రీనివాస్, లింగాల కోటేష్, పులిగంటి శ్రీనివాస్, చిట్యాల సమ్మయ్య, బొడ్డు రాజబాబు తదితరులు మంత్రి గారిని కలవడం జరిగింది.

You may also like...

Translate »