చేతిపంపుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలి

చేతిపంపుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలి
- ఆర్.డబ్ల్యూ.ఎస్ డీఈఈ మున్ని నాయక్
జ్ఞాన తెలంగాణ – బోధన్ : గ్రామీణ ప్రాంతాలలో చేతిపంపులు నిర్వహణ వాటి మరమ్మతులు సక్రమంగా చేపట్టాలని గ్రామీణ నీటిపారుదల శాఖ డిఈఈ మున్ని నాయక్ అన్నారు. గురువారం బోధన్ మిషన్ భగీరథ కార్యాలయంలో నీటి సహాయకులకు నిర్వహించిన 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న చేతి పంపులు పాడైన వాటిని గుర్తించి మరమ్మతులు చేయాలని, అలాగే వాటి నిర్వహణ సక్రమంగా ఉండేలా గ్రామ పంచాయతీలు బాధ్యత వహించాలని సూచించారు. అనంతరం చేతి పంపు మెకానిక్ లియాఖత్ చేతిపంపుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంట్రా ఏఈ అనిల్ కుమార్, గ్రిడ్ ఏఈ చంద్రకాంత్ శర్మ, మంచినీటి సహాయకులు పాల్గొన్నారు.