సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా డి. స్రవంతి రెడ్డి నియామకం.

సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా డి. స్రవంతి రెడ్డి నియామకం.
బొల్లారం మున్సిపల్ మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డిని సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా రాష్ట్ర నాయకురాలు,హైదరాబాద్ మహిళా మోర్చా పార్లమెంట్ కన్వినర్, మెదక్ మహిళా మోర్చా ఇంచార్జి దశరథ లక్ష్మి, సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా డి.స్రవంతి రెడ్డిని ఎన్నుకున్నట్టు నియామక పత్రాన్ని అందచేశారు.ఈ సందర్బంగా నియామక పత్రాన్ని అందుకున్న తరువాత డి. స్రవంతి రెడ్డి మాట్లాడుతూ పార్టీ నా పై నమ్మకముంచి పార్టీ భాద్యతలు అప్పగించినందుకు జిల్లా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
తన పదవికి శక్తివంచన లేకుండా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతనని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి టీ. మేఘన రెడ్డి తదితరులు ఉన్నారు.
