వేలం పాటలో దుర్గమాత ముక్కు పుడకను దక్కించుకున్న మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి దంపతులు

రూ.1,80,000/- ధర పలికిన అమ్మవారి ముక్కు పుడక
మహాలింగపురం గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎర్పాటు చేసిన దుర్గా మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి, కుసుమ రెడ్డి దంపతులు పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ముక్కు పుడకను వేలం పాటలో రూ.1,80,000/- (ఒక లక్ష ఎనభై వేలు) పాట పాడి దక్కించుకున్నారు.ఈ సందర్భంగా మాచన గారు రాఘవేందర్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ఎంతో భక్తి, నిష్ఠలతో కొలిచిన దుర్గామాత ముక్కుపుడకలు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు, దుర్గామాత దయవల్ల మహాలింగాపురం గ్రామస్తులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వెలుగొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.