కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: పీయూ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి
కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: పీయూ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట:

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పాలమూరు యూనివర్శిటీ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హజరైయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. గౌరవంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రతి విద్యార్థి పోరాడాలని దానిని సాధించేవరకు ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రంగారెడ్డితో పాటు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు