ప్రజల పక్షాన మాట్లాడే నాయకులు ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించుకుందాం

టీపీసీసీ సభ్యులు గుగులోతు దసురు నాయక్

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
రూరల్ మే 25.

ఈరోజు కాట్రపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిగెలిపించాలని గ్రాడ్యుయేషన్ చేసిన ఉన్నత విద్యావంతులను యువతీ యువకులను ఓటును అభ్యర్థించడం జరిగింది.

సందర్భంగా టీబీసీసీ సభ్యులు గూగుల్లోతు దసురు నాయక్ మాట్లాడు
గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు అవినీతి అక్రమాలు దోపిడీలను ప్రశ్నిస్తూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై పనిచేస్తున్న తీన్మార్ మల్లన్న పై గత ప్రభుత్వం హయాంలో ఎన్నో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి నిర్బంధిస్తూ అణచివేస్తూ ప్రతిపక్షమే లేకుండా చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను నియంతత్వం రాచకాలు ఎప్పటి కప్పుడు ఎండ కడుతూ తన మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ నిరుద్యోగ యువత యువకులకు అండగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రతిపక్ష పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, ఎమ్మెల్సీగా గెలిపించవలసిందిగా ఓటు అభ్యర్థించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పాల్వాయి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరికొండ మల్లయ్య గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...

Translate »