డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు దశలవారీగా పోరాటాలను ఉధృతం చేద్దాం…

  • డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు దశలవారీగా పోరాటాలను ఉధృతం చేద్దాం…
  • సిపిఎం పార్టీ నాయకులు

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కొరకు దేశ ల వారీగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని సిపిఎం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకయ్య అధ్యక్షతన లబ్ధిదారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత మూడు నెలలుగా డబుల్ బెడ్ రూమ్ లో ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ తోరూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో అనేక దఫాల ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి గాని, అధికారుల నుండి గాని ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 45 రోజులు సమయం ఇచ్చిన అధికారులు ఎక్కడ జాడ కనపడడం లేదని, ఎప్పటి వరకు రాజకీయ నాయకులే అబద్ధాలు ఆడతారు అనుకుంటే, అధికారులు కూడా అబద్ధాలు చెప్పేవారు అయ్యారని వారు సందర్భంగా గుర్తుకు చేశారు. తొర్రూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కడితే గత ప్రభుత్వం పేదలకు ఇండ్లు పంచలేదు. ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ డబల్ బెడ్ రూమ్ లను పంచడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి కఠిన ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని వెంటనే అర్హులైనటువంటి లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల పార్టీ, లబ్ధిదారులందరినీ కలుపుకొని దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేయాలని వారు అన్నారు. ఈనెల 23న పట్టణ కేంద్రంలో లబ్ధిదారులందరితో కలిసి ర్యాలీ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరి కలుపుకొని మహాధర్నా నిర్వహిస్తామని వారి సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్, పార్టీ మండల కార్యదర్శి ఎండి యాకుబ్, మండల కమిటీ సభ్యులు జముల శ్రీను, డొనక దర్గయ్య ,ఎండి నజీర్, తిమ్మిడి రవి, గడల మల్లయ్య, సాయిలు, ధర్మయ్య, ఎండి షమీనా, శోభ, వరలక్ష్మి ,శ్రీలత , రెడ్డెబోయిన అరుణ, రేణుక , నాగమణి ,అమీనా, సౌజన్య, యాకమ్మ ,కమలమ్మ, స్వరూప భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »