ప్రతీ ప్రయత్నంలో విజయం సాధిద్ధాం

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన గారి లక్ష్మారెడ్డి

జ్ఞాన తెలంగాణ,

ప్రతీ ప్రయత్నంలో విజయం సాధిద్ధాం అని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన గారి లక్ష్మారెడ్డి
అన్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా వాయుపుత్రుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం జీవితంలోని ప్రతీ ప్రయత్నంలో విజయం సాధిద్ధాం ఆయన ఆశీర్వాదం దక్కాలని కోరుకుందాం అన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మామిడిపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి,బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు అంత మంచి జరగాలని స్వామిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »