అసంఘటిత కార్మికుల కోసము న్యాయ విజ్ఞాన సదస్సు.

అసంఘటిత కార్మికుల కోసము న్యాయ విజ్ఞాన సదస్సు.
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా మే 22.:
చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సిద్దిపేట ఆదేశము ప్రకారము సిద్ధిపేట జిల్లా కోర్ట్ భవనములో బుధవారం రోజున అసంఘటిత కార్మికుల కోసము న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కుమారి శ్రావని యాదవ్, సిద్దిపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, కార్మికుల సంక్షేమ పథకాలు గురించి వారికి తెలియ చేసారు. వివాహ బహుమతి పదకము, ప్రాణాంతక ప్రమాదాల లబ్ది పతాకము, సాధారణ మరణ లబ్ది పథకము గురించి తెలియజేసారు.
ప్రతి కార్మికుడు తప్పని సరిగా లేబార్ డిపార్టుమెంటులో పేరు నమోదు చేసుకొని గుర్తింపు కార్డును పొందాలని తెలిపారు. గుర్తింపు కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలకు అర్హులని తెలిపారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయసేవధికార సంస్థను సంప్రదించ వచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమములో లీగల్ ఎయిడ్ డిపెన్సు కౌన్సెల్స్ ఎన్.బాలయ్య, ఎ.శ్రీకర్ రెడ్డి, నిరేటి వెంకటేష్, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది ఎల్.మదుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.