ప్రభుత్వ భూమి కబ్జా వత్తాసు పలుకుతున్న బిఆర్ఎస్ నాయకులు.

ప్రభుత్వ భూమి కబ్జా వత్తాసు పలుకుతున్న బిఆర్ఎస్ నాయకులు.
జ్ఞాన తెలంగాణ,కేసముద్రం రూరల్ మే 30.
ఇంటికన్నె గ్రామ శివారులోని సర్వే నెంబర్ 23 లో ప్రభుత్వ భూమి కలదు అలాగే శనిగకుంట నింపడానికి వరద నీటి ప్లీడర్ చలాన్ కెనాల్ కలదు ఈ భూమిలో కొంత భాగం పేద ప్రజలు ఇండ్లు వేసుకొని గత 15 సంవత్సరాలుగా నివసిస్తున్నారు కొంత భాగం అనగా సుమారు 20 గుంటల భూమిలో సుమారు 20 అడుగుల లోతు పెద్ద గుంతలు తవ్వి మట్టిని ఇంటికన్నె గ్రామపంచాయతీ వారు తదితర అవసరాల కోసం వాడుకున్నారు ఆ గుంతను ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు మరికొంత భాగం బానోతు కుమార్ అనే రైతు సేద్యం చేసుకుంటున్నాడు గతంలో బానోతు కుమార్ అనే రైతు మిగతా భూమిని కబ్జాకు ప్రయత్నం చేయగా నాటి తాసిల్దార్ బన్సీలాల్ గారు హద్దులు నిర్ణయించి బోర్డు పెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా అర్ధరాత్రి సమయంలో అందాజ 11 గంటల తర్వాత నెంబర్ లేని టాక్టర్లతో, జెసిబి నెంబర్AP36 AH 1806 పెట్టి ప్లీడర్ చలాన్ నీటి కాలువ ను ఇరువైపులా ధ్వంసం చేసి మట్టిని తీసి 20 గుంటలు గల పెద్ద పెద్ద గుంతల లో మట్టి నింపి చదును చేస్తున్నారు ప్రక్కనే 15 మీటర్ల దూరంలో ఆవాస ఇండ్లు ఉన్న కూడా పెద్దపెద్ద బండరాలను బ్లాస్టింగ్లు చేస్తున్నారు ఎలాంటి ప్రభుత్వాలు అనుమతులు లేకుండా అర్థరాత్రలలో నెంబర్ లేని వాహనాలతో భూ కబ్జాలు చేయడం, వరద నీటి కాలువను ధ్వంసం చేయడం, బ్లాస్టింగ్ చేయడం తప్పు అని ప్రశ్నిస్తే ఈ పెద్ద గుంతలో పూడ్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వరద నీటి కాలువ ధ్వంసంతో శనగకుంట నిండడం కష్టమని ఈ కుంట కింద 150 వ్యవసాయ బావులు, సుమారు 1000 ఎకరాల వ్యవసాయ భూములు, కలదు ఇంటికన్నె గ్రామ ప్రజలకు, తండవాసులకు త్రాగునీటి బోరు బావులు ఈ కుంటలోనే కలదు వరద నీటి కాలువ ను ధ్వంసం చేయడంతో రైతుల ఆవేదన వర్ణాతితం అలాగే బ్లాస్టింగ్ తో పక్కన ఉన్న ఇండ్ల గోడలు బీటలు వస్తున్నాయని ఇంటి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా తెలిసి కూడా భూ కబ్జాదారులకు టిఆర్ఎస్ నాయకులు వత్తాసు పలకడం సిగ్గుచేటని అలాగే ప్రభుత్వ కాలువను, భూమిని భూకబ్జాదారుల నుండి కాపాడాలని ప్రభుత్వ భూమికి సరిహద్దులు నిర్ణయించాలని స్థానిక తాసిల్దార్ గారికి విన్నవించారు, అలాగే నెంబర్ లేని వాహనాలను సీజ్ చేయాలని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి విన్నవించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అయితే సారయ్య, రాజుల పార్టీ మల్లయ్య, దొమ్మటి. దేవేందర్ గౌడ్, శ్రీనివాస్ నాయక్.మిట్టగడపుల.యాకయ్య, గాదె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.