మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కాస్మోపాలిటన్ కాలనీ లో నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు మాజీ కార్పోరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి .అనంతరం సుధీర్ రెడ్డి గారు అట్టి పార్క్ ఆవరణలో దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వారు మంజూరు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు పరీక్షించడం జరిగింది.ఇప్పటికి చెక్కు చెదరకుండ ఉన్నాయని ప్రస్తుతం పార్కుల్లో నిర్మించే ఓపెన్ జిమ్ పరికరాలు నాసిరకంగా ఉంటూ కొన్ని రోజులకే విరిగిపోతున్నాయి అని అన్నారు.అనంతరం పక్కనే ఉన్న అసోసియేషన్ స్థలంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇట్టి విశాలమైన స్థలంలో అప్పట్లోనే కమ్యూనిటి హాల్ మరియు ఆటస్థలం కోసం ప్రతిపాదనలు పంపడం జరిగింది అని గుర్తు చేశారు.అలాగే రాబోయే తరాలను దృష్టికి పెట్టుకుని మాన్సూరాబాద్ రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు జగదీష్ యాదవ్,టంగుటూరి నాగరాజు,యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,భాస్కర్ యాదవ్ కాలనీవాసులు రుద్ర లక్ష్మీనర్సింహా,శ్రీకాంత్,శ్రీనివాస్,సత్తయ్య,భాస్కర్,రమేష్,గోపాల్,జ్ఞానేశ్వర్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.