లక్షలు వెచ్చించి ..లక్షణంగా వదిలేశారు.


–నెలల తరబడి ప్రారంభోత్సవానికి నోచుకోని పల్లె దవాఖానా.
–వైద్య సేవలకు తప్పని ఇబ్బందులు.
ఫోటో.కొప్పర్గ గ్రామంలో ప్రారంభోత్సవం చేయక వృధాగా ఉన్న పల్లె దవాఖాన భవనం.
జ్ఞాన తెలంగాణ – బోధన్
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి బోధన్ మండలంలోని పలు గ్రామాలలో పల్లె దవాఖానా భవనాలను నిర్మించింది. అంత వరకు బాగానే ఉంది కాని బోధన్ మండలం కొప్పర్గ గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన భవనం నిర్మాణం పూర్తయి సుమారు 6-7 నెలలు గడుస్తున్న ఇప్పటికి ప్రారంభోత్సవం చేయలేదు. దాంతో గ్రామ ప్రజలకు సక్రమంగా వైద్య సేవలందక ఇబ్బందులు పడవవసి వస్తుంది.అంతేకాకుండా వైద్యం కోసం సాలూర పీహెచ్ సీ కి, పెగడాపల్లి పీహెచ్ సి కి బోధన్ జిల్లా ఆసుపత్రకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. పల్లె దవాఖాన పనులు సంపూర్ణంగా పూర్తయిన విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా వదిలేశారు.భవనం నిరుపయోగంగా ఉండడంతో ఆకతాయిలు వెంటిలేషన్ అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది ఇరుకైన గదిలో వైద్య సేవలు అందించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ పల్లె దవాఖాన ప్రారంభిస్తే గర్భిణీలకు, బాలింతలకు వ్యాక్సినేషన్, ఇమ్యూనిజినైజేషన్ తో పాటు ఇతర వైద్య పరీక్షలు చేపట్టే అవకాశం ఉంది.కావున అధికారులు ఇప్పటికైన స్పందించి పల్లెదవాఖాన ప్రారంభించి రోగులకు, గర్భిణి,బాలింతలకు వైద్య సేవలందించే ఏర్పాట్లు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

You may also like...

Translate »