బ్రభుత్వ నిర్లక్ష్యనికి బలైన లక్షలాది నిరుద్యోగులు

Image Source | Picxy
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రెండవ సారి రద్దు చేసింది.పరీక్షా నిర్వహణ సరిగ్గాలేదని బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం, హాల్టికెట్ నెంబర్ లేకుండా OMR షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ తప్పిదాలను పరిశీలించి,గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.
పేపర్ లీక్ కారణంగా గతంలో గ్రూప్ 1 రద్దవగా ఇప్పుడు మల్లి రెండవ సారి రద్దయింది.తొమ్మిది సంవత్సరాలు గా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేసి ఒకే సరి అన్ని నోటిఫికెషన్స్ కుమ్మరించి,ఆ పరీక్షా పేపర్ లు లోలోపల అమ్ముకుని లక్షలాది పేదల నోట్లో మట్టికొట్టి,TSPSC బోర్డు రోడ్డు చేయకుండా పరీక్షలు నిర్వహించి ఆ నిర్వహణలో సైతం తప్పులు చేసి రాష్ట్ర నిరుద్యోగుల జీవితాలని ఛిద్రం చేసింది.
గత 10 సంవత్సరాలుగా ఇల్లు వాకిలి విడిచి,ఆకలి దప్పికలు మరిచి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగుల కళ్ళల్లో కారం చల్లింది.రెండవ సారి పేపర్ రద్దు అవ్వడం తో వెలది నిరుద్యోగులు కన్నీరు మున్నీరు అవుతూ ప్రభుత్వం పై మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు.
