బిఆర్ఎస్ పార్టీ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 14:
ఈ నెల 17వ తేదీన షాబాద్ లో రైతు ధర్నాలో పాల్గొననున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.మంగళవారం షాబాద్ మండలంలోని లింగారెడ్డిగూడ,అప్పారెడ్డిగూడ, మన్మర్రి, బోడంపహాడ్, అంతారం, కుర్వగూడ, సర్దార్ నగర్, కక్కులూర్, కేసారం గ్రామాల్లో పర్యటించి పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, అందుకు నిరసనగా ఈనెల 17వ తేదీన షాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు ధర్నా కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న సందర్భంగా మండలంలోని 41 గ్రామ పంచాయతీల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు, యువకులు, పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు అవినాష్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నక్క శ్రీనివాస్ గౌడ్, చల్లా శ్రీరాంరెడ్డి, హరీఫ్, పోలేపల్లి శ్రీనివాస్ గౌడ్, భానూరి మధుసూదన్ రెడ్డి, బుయ్యని మల్లికార్జున్ గౌడ్, భానూరి రాంమ్మోహన్ గుప్తా, గంగాపురం యాదిరెడ్డి, గూడూరు రాంచంద్రారెడ్డి, కారు చెన్నయ్య, కావలి యాదయ్య, కారు మహేష్, పుల్లన్నగారి శ్రీనివాస్ రెడ్డి, మొగిలిగిద్ద నర్సింహారెడ్డి, బండి జంగయ్య, జగ్గారెడ్డి, సత్యం, మామిడి ప్రదీప్, హరీష్, శశాంక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.