రేవంత్ రెడ్డీ పై విరుచుకుపడ్డ కేటీఆర్

రేవంత్ రెడ్డీ పై విరుచుకుపడ్డ కేటీఆర్

  • నిధుల కోసం భూములు తకట్టా..?
  • అలా చేస్తే పరిశ్రమలు ఎలా వస్తాయి?
  • మన యువతకు ఉద్యోగాలు ఎలా?
  • ప్రమాదకరమార్గాన్ని ఎంచుకున్న సర్కారు
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌

మా జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,జులై 11: హాస్టళ్ల నిర్వహణ తీరుపై వ్యంగ్యాస్ర్తాలురాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్‌ సరార్‌, ఇప్పుడు నిధుల సమీకరణ కోసం ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు, దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్‌ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు మీడియాలో వస్తున్న కథనాలను కోట్‌ చేస్తూ ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్‌చేశారు.తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎకువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటిచోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని విమర్శించారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా పారిశ్రామికరంగం స్తబ్దుగా మారిందని, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని, ఉన్న కంపెనీలు కూడా ప్రోత్సాహం లేక పకచూపులు చూస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన భూములను రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెడితే కంపెనీలు ఎలా వస్తాయని, కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు.చిట్టెలుకలు, బల్లి పడిన టిఫిన్లు..’పురుగుల అన్నం. నీళ్ల చారు. బల్లిపడిన టిఫిన్లు.. చిట్టెలుకలు తిరిగే చట్నీలు’ అని రాష్ట్రంలో హాస్టళ్ల దుస్థితిపై కేటీఆర్‌ వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. కాంగ్రెస్‌ పాలనలో హాస్టళ్లు దయనీయంగా మారాయని ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలంటే మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చి పెద్ద మార్పే తెచ్చారు’ అని ఎద్దేవా చేశారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషితాహారం తిన్న విద్యార్థి విషాదాంతం, నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి 20 మంది విద్యార్థులకు వాంతులు, సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థుల బెంబేలు’ అని సర్కారు హాస్టళ్ల తీరుపై విమర్శలు గుప్పించారు. విషాహారం పెడితే విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు? తల్లిదండ్రులకు భరోసా ఏది? అని ప్రశ్నించారు. హాస్టళ్లల్లో కలుషితాహారం వల్ల పిల్లలు దవాఖానల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సర్కారు అస్తవ్యస్త విధానాలే ఇందుకు కారణమని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరచి భావి పౌరుల ప్రాణాలకు భరోసా ఇవ్వాలని సూచించారు.

You may also like...

Translate »