పత్రికా విలేఖరి అంగల తిరుపతి పై దాడి చేసిన ఖలీం ను వెంటనే అరెస్టు చేయాలి

  • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల నిరసన
    జ్ఞానతెలంగాణ, కొమురం భీమ్ ఆసిఫాబాద్:
    కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన అంగల తిరుపతి పై దాడి చేసిన ఖలీం ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ ల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సి. హెచ్. సురేష్, కృష్ణంరాజు, కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు టి. సురేందర్ రావు, వి. తిరుమల చారి మాట్లాడుతూ దాడి చేసిన ఖలీం ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తున్న స్థలాన్ని అధికారులు ఇప్పటివరకు సందర్శించలేదని, వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి మైనింగ్ అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టా భూమి అయితే పట్టదారునికి నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

You may also like...

Translate »