గ్రూప్-1 రెండవ సారి రద్దు కావడానికి ముమ్మాటికి కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలననే కారణం.

బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంది కంటి విజయ్ కుమార్

ఆనాడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పోరాటం వల్లనే పరీక్షను రద్దు చేశారు.

ఆనాడే బీయస్పీ డిమాండ్ చేసినట్లుగా మొత్తం కమీషన్ని ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.

ఎర్రవల్లి చౌరస్తా : గ్రూప్-1 రెండవ సారి రద్దు కావడానికి ముమ్మాటికి కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలననే కారణంఅని బిఎస్పీ నాయకులు అన్నారు.
ఆనాడే బీయస్పీ డిమాండ్ చేసినట్లుగా మొత్తం కమీషన్ని ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదని బిఎస్పీ నాయకులు అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం చౌరస్తా లోని ఎంజి భవన్ లో ప్రెస్ నోట్ నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఆనాడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పోరాటం వల్లనే మొదటి పరీక్షను రద్దు చేశారు.

ఆలస్యం చేయకుండా
TSPSCofficial మొత్తం కమీషన్ అర్జంటుగా రాజీనామా చేయాలి. (డా.జనార్దనరెడ్డి గారు, మీకు ఏ మాత్రం నైతిక విలువలున్నా స్వచ్ఛందంగా వైదొలగి పోలీసులకు నిజం చెప్పాల్సిందిగా కోరుతున్నా)
కమీషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించిన తరువాతనే మిగతా పరీక్షలను నిర్వహించాలన్నారు.
కొత్తగా వచ్చిన 270 OMR షీట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు.
SIT ఇన్వెస్టిగేషన్లో కమీషన్ ఛైర్మన్,సభ్యులు మరియు SO వెంకటలక్ష్మిలను నిందితులుగా చేర్చాలన్నారు.
ఈ కేసును CBI కు అర్జంటుగా అప్పగించాలని డిమాండ్ చేశారు.
అందరు అభ్యర్థులకు కనీసం లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.
నవంబర్ లో జరగనున్న గ్రూప్-2 మరియు మిగతా పరీక్షలన్నీ కొత్త కమీషన్ హాయాంలోనే జరగాలి. ఈ కమీషన్ పై ప్రజలకు విశ్వాసం లేదు(ఒక్క KCR కుటుంబానికి తప్ప) అని అన్నారు.
Gr-1 కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి మరియు కేటీఆర్ పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలన్నారు.
గత గ్రూప్-1 ప్రిలిమ్స్ టాపర్ ఎవరో ముఖ్యమంత్రే స్వయానా వెల్లడించాలన్నారు.

ఇవన్నీ జరగని పక్షాన లక్షలాది నిరుద్యోగ బిడ్డలూ, వారి కుటుంబాలు వారికి అండగా బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఆందోళల కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి ఎంజీ కృష్ణ, నియోజకవర్గ అధ్యక్షులు తిరుపాల్, ఇటిక్యాల మండలం అధ్యక్షులు యువరాజ్, ఎర్రవల్లి మండలం అధ్యక్షులు పరుశురాముడు, తదితర మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...

Translate »