ఆత్మరక్షణ కోసమే కరాటే శిక్షణ


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బెల్ట్ ఎగ్జామ్ కార్యక్రమానికి 26 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలో నెగ్గిన వారికి బెల్టును అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కె ఎస్ శ్రీనివాస్ చారి, ఎం బాలసుబ్రమణ్యం, సీనియర్ బ్లాక్ బెల్ట్ రాజ్ కుమార్, పవన్, భారతి, సీనియర్ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు బెల్టులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ చారి మాట్లాడుతూ విద్యార్థులందరికీ ఆత్మరక్షణ కోసమే కరాటే శిక్షణ అవసరమని తెలిపారు. మహిళా బాలికలు కూడా నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న పోటీ ప్రపంచంలో మహిళలు చురుకుగా అన్నిరంగాలలో పోటీపడాలని కరాటే శిక్షణ కూడా నేటి మహిళలకి అవసరమని అన్నారు.

You may also like...

Translate »