బీజేపీ కార్యకర్తల పోరాటం వల్లనే కాల్వపల్లి గ్రామానికి రోడ్డు పూర్తి- బీజేపీ ఓబీసీ మోర్చా

జిల్లా కన్వీనర్ పంచిక మహేష్జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 04:భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని కాల్వపల్లి గ్రామానికి తారు రోడ్డు వేయడం జరిగింది.ఈ గ్రామంలో అన్ని పార్టీలు ఉన్నాయి కానీ రోడ్డు కోసం ఏ రోజు ఏ పార్టీ ముందుకు రాలేదు అనిబీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కన్వీనర్ పంచిక మహేష్ అన్నారు ఈ రోడ్డు కోసం పోరాటం చేసింది బిజెపి పార్టీ మాత్రమే అని అంతకు ముందు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డిని రోడ్డు గురించి అడ్డుకున్నది కూడా బిజెపి కార్యకర్తలే అని గుర్తుచేస్తూ ఈరోజు బిజెపి కార్యకర్తల పోరాటం వల్లనే ఈ రోడ్డు కలను నెరవేర్చుకున్నం అని అన్నారు. గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నది బీజేపీ కార్యకర్తల వల్లనే అని, కానీ మళ్లీ బస్సు కోసం ఏమైనా పోరాటం చేయాలో అన్న దిగులు మొదలైందని, ఒకవేళ బస్సు గ్రామానికి రాకపోతే మళ్ళీ బిజెపి కార్యకర్తలు పోరాటం చేస్తారని వ్యక్తం చేసారు.

You may also like...

Translate »