తెలుగులో కుమార స్వామికి డాక్టరేట్ ప్రదానం. కాకతీయ యూనివర్సిటీ:

తెలుగులో కుమార స్వామికి డాక్టరేట్ ప్రదానం. కాకతీయ యూనివర్సిటీ:
తెలుగు విభాగ పరిశోధకుడు కల్లెబోయిన కుమార స్వామికి విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహ చారి డాక్టరేట్ ప్రకటించిర్రు. డాక్టర్ కుమార స్వామికి ” తొలితరం తెలంగాణ కథలు గ్రామీణ జీవన సంస్కృతి” అనే అంశంపై విభాగ విశ్రాంతి ఆచార్యులు కె. యాదగిరి పర్యవేక్షణలో పిహెచ్. డి పూర్తి చేసిర్రు.ప్రస్తుతం పింగళి ప్రభుత్వ డిగ్రీ మరియు పిజి కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పని చేస్తున్నరు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కొరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, కేయూ వరంగల్, ఓయూ హైదరాబాద్ , ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థి ఉద్యమాల్లో, సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిండు. కల్లెబోయిన రాజయ్య – సరోజనల దంపతులకు కుమార స్వామి జన్మించిండు. ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత హన్మకొండ జిల్లా నివాసి.బీసీ సామాజిక వర్గం ముదిరాజ్ నిరుపేద కుటుంబానికి చెందిన కుమార స్వామి చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి సరోజన తన పిల్లల్ని పోషించింది.తల్లి కూలీ పనులు చేస్తూ చదివించింది. ఎం. ఫిల్, ఏపి – సెట్, యూజిసి – నెట్ ( జె ఆర్ ఎఫ్ ) సాధించిండు. కుమార స్వామికి డాక్టరేట్ ప్రకటించడంతో ఆచార్యులు , తోటి పరిశోధకులు,విద్యార్థులు, గ్రామస్థులు,బంధువులు, మిత్రులు, పలువురు అభినందించిర్రు.