కడియం కావ్యకు ఓటేసి గెలిపిస్తే గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలిస్తాం…

కడియం కావ్యకు ఓటేసి గెలిపిస్తే గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలిస్తాం…
- బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మీ ఓట్లతో బుద్ది చెప్పండి..
- భూపాలపల్లి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జ్ఞానతెలంగాణ భూపాలపల్లి , మే 11:
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్ది డాక్టర్ కడియం కావ్యకు మీ ఓటేసి గెలిపిస్తే గుడిసె వాసులకు తప్పక ఇళ్ల పట్టాలిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శనివారం రోజున పార్లమెంట్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే జీఎస్సార్ భూపాలపల్లి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ప్రజలనిద్దేశించి ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్ది డాక్టర్ కడియం కావ్యకు మీ ఓటేసి గెలిపిస్తే గుడిసె వాసులకు తప్పక ఇళ్ల పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని అన్నారు. పదేళ్ల మోదీ పాలనలో ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు గుర్తుచేశారు. దేవుడి పేరుతో మతాల మధ్య చిచ్చు పెడుతూ, పబ్బం గడిపే బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. ఈ పదేళ్ల బీఆర్ఎస్, బీజేపీ పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. దొంగ మాటలు, మాయ మాటలతో మీ ముందుకు ఓటు అడగడానికి వస్తున్న పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు. వరంగల్ లో డాక్టర్ కడియం కావ్య కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.