– గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కు ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
– పాల్గొననున్న 13 కబడ్డీ జట్లు 130 మంది క్రీడాకారులు
– తమ కబడ్డీ క్రీడాకారుల విన్యాసాలు తిలకించేందుకుఆసక్తి తో ఎదురుచూస్తున్న క్రీడా ప్రేమికులు గ్రామ ప్రజలు
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: కబడ్డీ ఆటకు ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరు గ్రామం లో, సంక్రాంతి పండగను పురస్కరించుకుని గ్రామ స్థాయిలో భారీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. గ్రామ పెద్దల సహకారం తో, గ్రామ యువకులు క్రీడా ప్రేమికులు ఈ రోజు జరిగే కబడ్డీ టోర్నమెంట్ కు భారీ ఏర్పాట్లు చేయగా, గ్రామ స్థాయిలో విశేష స్పందన లభించింది, ఈ టోర్నమెంట్ కు 13 కబడ్డీ జట్లు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. 13 జట్లలోని 91 మంది క్రీడాకారుల విన్యాసాలను తిలకించేందుకు క్రీడ ప్రేమికులు గ్రామ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ తిలకించేందుకు వచ్చిన క్రీడా అభిమానులకు క్రీడాకారులకు చక్కటి వంటకాలు కూడా సిద్ధం చేస్తున్నారు. గ్రామ ప్రజలు, క్రీడా అభిమానులు మరియు మాజీ కబడ్డీ క్రీడాకారులు తప్పకుండా హాజరు కావాలని అర్గనైజర్స్ ప్రసాద్ యాదవ్, శివకుమార్, కార్తీక్, కె మహేందర్ లు ఓ ప్రకటనలో తెలియజేశారు.