పొద్దుటూరులో కబడ్డీ విప్లవం:కబడ్డీ కోచ్ గా నేషనల్ ప్లేయర్ శివయ్య

- క్రీడల ద్వారా యువతకు కొత్త దారి – క్రమశిక్షణ, పట్టుదల పెంపొందించాలనేదే లక్ష్యం
- యువతను దుర్వ్యసనాల నుండి కాపాడడం కొరకే క్రీడలకు ప్రోత్సాహం- బండ నర్సింహా
- కబడ్డీ మైదానానికి భూమి పూజ – గ్రామ యువతలో ఉత్సాహం
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: నేటి యువత అనేక దుర్వ్యసనాలకు లోనవుతూ, చిన్న వయస్సులోనే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం, మత్తు పదార్థాల ప్రభావం, సెల్ఫోన్లకు బానిసలుగా మారడం వంటి దుష్ప్రభావాల నుంచి యువతను బయటకు తెచ్చేందుకు పొద్దుటూరు గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్ బండ నరసింహ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
పొద్దుటూరు గ్రామం కబడ్డీ ఆటకు ప్రసిద్ధి గాంచిన ఊరు కావడంతో, యువతను మళ్లీ క్రీడల వైపు ప్రోత్సహించేందుకు నేషనల్ కబడ్డీ ప్లేయర్ భానుర్ వాసి కుమ్మరి శివయ్యను (శివ) కోచ్‌గా నియమించారు. పొద్దుటూరు మాజీ డిప్యూటీ సర్పంచ్ బండ నర్సింహా తనస్వంత నిధులతో కోచ్ ను ఏర్పాటు చేశారు.ప్రతిరోజూ సాయంత్రం రెండు గంటల పాటు క్రీడాభ్యాసం చేయించడం ద్వారా యువత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వారిలో స్నేహభావం, పట్టుదల, క్రమశిక్షణ పెంపొందుతుందని అన్నారు.
ఈ నేపథ్యంలో గురువారం గ్రామంలోని కబడ్డీ మైదానానికి భూమి పూజ నిర్వహించి, శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. మొదటి రోజు కోచ్ శివయ్య యువకులకు క్రమశిక్షణ, పెద్దలతో మెలగే విధానం, లోబడే తత్వం, కష్టపడే ధోరణి గురించి విలువైన పాఠాలు బోధించారు. కబడ్డీ ఆటకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను తెలియజేశారు.
కబడ్డీ శిక్షణ పొందుతున్న యువకులు మాట్లాడుతూ, నేషనల్ స్థాయి క్రీడాకారుడి నుంచి శిక్షణ పొందడం తమ అదృష్టమని, ఆయన ద్వారా అనేక విలువైన విషయాలు నేర్చుకుని భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటామని తెలిపారు. కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన శివన్న కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ వారి మాటలలో తెలియజేశారు తెలియజేశారు.
కబడ్డీ కోచ్ ను ఏర్పాటుచేసిన మాజీ డిప్యూటీ సర్పంచ్ బండ నర్సింహా కు, ప్రాక్టీస్ కొరకు కోర్టు ను ఇచ్చి, సహకరించిన క్రాంతి యూత్ క్లబ్ సీనియర్ కబడ్డీ ఆటగాడు బూడిదల యాదయ్యకు, కోర్టును సిద్ధం చేయడానికి తన డోజర్ ను ఏర్పాటుచేసి సహకరించిన కబడ్డీ సీనియర్ ఆటగాడు బూడుదుల నవీన్ కుమార్ కు, ట్రైనీ క్రీడాకారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జూనియర్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ క్యాసారం నవీన్, క్రాంతి యూత్ క్లబ్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, మందు మూల లక్ష్మణ్, మాజీ వార్డ్ మెంబర్ నాని రత్నం, గ్రామ యువకులు, కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.

