సమస్యలను పట్టించుకోని కె.యు వి.సి తక్షణమే రాజీనామా చేయాలిఎస్ఎఫ్ఐ

సమస్యలను పట్టించుకోని కె.యు వి.సి తక్షణమే రాజీనామా చేయాలి
ఎస్ఎఫ్ఐ
కేయూ విద్యార్థుల పొట్ట మారుస్తున్న యూనివర్సిటీ అధికారులు
యూనివర్సిటీకి రెగ్యులర్ విసిని నియమించాలి
మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి
కాకతీయ యూనివర్సిటీ జ్ఞాన తెలంగాణ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా వారి పొట్ట కొడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ అన్నారు ఆదివారం రోజున కామన్ మెస్ లో విద్యార్థులందరూ పూర్తిగా భోజనం చేయకముందుకే మెస్సులో 1,15 గంటల నిమిషాలకే అన్నం కూరలు అయిపోయాయి అన్నారు అలాగే ఈరోజు ఆదివారం రోజు కావడం వలన విద్యార్థులకు మెనూ ప్రకారం చికెను పెట్టాలన్నారు కానీ చికెను పెట్టలేదు అన్నారు విద్యార్థులకు నాణ్యతలేని కుళ్ళిపోయిన కోడి గుడ్లను ఇస్తున్నారు అన్నారు అలాగే పచ్చి అరటిపళ్లను ఇస్తున్నారన్నారు యూనివర్సిటీలో దాదాపు 10, 15 రోజుల నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతలేరన్నారు అలాగే మెనూ కూడా పాటించడం లేదన్నారు ఈ విషయంపై వారం రోజుల క్రితం రిజిస్టర్ గారికి హాస్టల్స్ డైరెక్టర్ గారికి చెప్పడం జరిగిందన్నారు అయిన వారు ఎలాంటి సమస్యలను కూడా పట్టించుకోవడం లేదన్నారు అందుబాటులో ఉండడం లేదన్నారు ఫోన్ చేస్తే కూడా సమస్యలపై మాట్లాడితే విద్యార్థులనే దూషిస్తున్నారన్నారు విద్యార్థులకు మాత్రం మెస్ బిల్లులు పెంచుతూ కరెక్ట్ గా వేస్తున్నారు కానీ వారికి నాణ్యమైన భోజనం అందించడం లేదన్నారు కేర్ టేకలర్ కూడా సరిగా పట్టించుకోవడం లేదన్నారు పూర్తిగా విద్యార్థులకు నాణ్యతలేని భోజనాన్ని కూరలను వడ్డిస్తున్నారు అన్నారు ఈరోజు అన్నం త్వరగా అయిపోవడం వలన దాదాపు 100 మంది విద్యార్థులు తినకుండానే వెని తిరిగి వెళ్లిపోయారన్నారు ఈ సమస్యలకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు లేదంటే యూనివర్సిటీలో పరిపాలన భవనాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పవన్ ప్రదీప్ అజయ్ సందీప్ మంగీలాల్ శ్రీకాంత్ అవినాష్ వినయ్ రత్నాకర్ సాయి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు