కే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పై మండిపడ్డ: వరంగల్ స్వేరో వైస్ ప్రెసిడెంట్ సిద్దు

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండలో అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దూడల సిద్ధూ మాట్లాడుతూ… చరిత్ర తెలియని నీవు చరిత్ర తెలిసిన నాయకున్ని విమర్శిస్తావా? అని ప్రశ్నించారు.పైరవీలతో ఉద్యోగం పొందిన నువ్వు ప్రజలను శాసించే నాయకుడు ఎలా అవుతావు అని అన్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పక్కన విజ్ఞాన వంతులు, స్వేరోలు ఉంటే నీ పక్కన రౌడీ షీటర్లు హంతకులు ఉన్నారు కదా ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి ఉందో లేదో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. ఈరోజు నీకున్న ప్రాణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టిన బిక్ష అని అన్నారు. సమాజానికి జ్ఞానవంతులు విద్యావంతుల గా తయారు చేసిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఒక ఉన్నతమైన ఉద్యోగ హోదాలో ఉండి రౌడీలు హంతకులుగా తయారు చేసిన చరిత్ర నీదాన్ని అన్నారు.స్వేరో, ఆర్ఎస్ కుమార్ పైన అసత్య ఆరోపణ చేస్తే వరంగల్లో తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు.

You may also like...

Translate »