సాంస్కృతిక సామాజిక పునర్జీవ పితామహుడు పూలే

మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని పూణే జిల్లా లో చిన్నాబాయి గోవిందరావు దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించారు ఈయన ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత ఆధునిక విద్యా విధానం యొక్క ఫలితంగా మూడో సంప్రదాయాలు ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నాడు అతడు ప్రెంచ్ విప్లవం ఉద్దేశించిన స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం లాంటి ఆశయాలను మనదేశంలో ప్రవేశపెట్టిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే బానిసత్వం కులవ్యవస్థ మూఢనమ్మకాల వల్లనే దేశం కుంటుపడిపోయిందని అందుకే దేశం అభివృద్ధి చెందడం లేదని అన్నారు.
ఒకరోజు తన బ్రాహ్మణ స్నేహితునీ వివాహ ఊరేగింపులో అందరూ బ్రాహ్మణులే ఉన్నారు ఒక పూలే మాత్రమే బ్రాహ్మనేతరుడు ఉన్నాడు ఈ విషయం గమనించిన ఓ వ్యక్తి అందరి ముందు పూలే ను తిట్టి అక్కడి నుంచి వెలివేస్తాడు ఈ అవమానాన్ని భరించలేక అందుకు గల కారణాన్ని ఆ కుల వ్యవస్థ గురించి పూలే తెలుసుకున్నాడు మనుషులంతా సమానం కాదని వివిధ కులాలతో మనుషులు విభజించబడి ఉన్నారని అన్నాడు ఈ తారతమ్యం పోవాలి అంటే శూద్ర కులాలకు ప్రతి ఒక్కరికి విద్య అవసరమని అది కూడా నూతన విద్యా విధానం ద్వారా మాత్రమే సాధ్యం అని అప్పుడే ఈ సమాజంలో మార్పు తెగలము విషయాన్ని పూలే గుర్తించారు

మనిషిని మహోన్నతిగా తీర్చేది తేదీ విద్య ఒక్కటే అని తెలియజేశాడు

తృతీయ రత్న అనే ఒక నాటిక రాసి చదువుకో ప్రాధాన్యతను అందరికీ వివరించాడు

పూణేలోని బుధవార పేటలో మొట్టమొదట పాఠశాలను స్థాపించారు పూలే స్త్రీ విద్యావంతురాలు అయితే తన కుటుంబం అంతటిని చదివిస్తుందని అనుకున్నాడు ముందుగా తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించాడు ఆ కాలంలో స్త్రీలు చదవకూడదు బయటికి రాకూడదు పురుషులతో మాట్లాడకూడదు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారు అదేవిధంగా సమాజ కట్టుబాట్లు కూడా ఉండేవి నాటి సాంప్రదాయాలను కాదని స్త్రీ లను చదివించడానికి అప్పట్లోనే 18 పాఠశాలలు స్థాపించి స్త్రీలకు శూద్రులకు విద్యను నేర్పించడం ప్రారంభించాడు పూలే

ఆత్మగౌరవాన్ని సత్యసంధతను పాటిస్తాను
అందరి పట్ల ప్రేమను కలిగి ఉంటాను
తమ హక్కులను గుర్తించే విధంగా సహకరించే విద్యను పిల్లలకు బోధిస్తాను అని పాఠశాలలను ప్రారంభించి చదువు నేర్పించాడు

దక్షిణానికి వ్యతిరేకంగా స్త్రీకి అంటరాని వారి గురించి పాఠశాలలు తెరవడం బ్రాహ్మణ భావాజాల నికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో సహించలేని బ్రాహ్మణులు పూలే ను హత్య చేయడానికి హంతకులను పంపారు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా పూలే వెనకడుగు వేయలేదు

విద్యా లేనిదే వివేకం లేదు వివేకం లేక నీతి లేదు నీతి లేనిదే పురోగతి లేదు పురోగతి లేనిదే విత్తమ్ లేదు విత్తము లేకనే శూద్రులు అధోగతిపాలయ్యారు ఇన్ని అనర్థాలకు మూలం విద్య లేకపోవడమే
అని మహాత్మ జ్యోతిరావు పూలే అన్నాడు

ఆనాదిగా వస్తున్న చాతర్వర్ణాన్ని వ్యతిరేకించాడు నిచ్చేన మెట్ల కుల వ్యవస్థలో కొందరు పై స్థానంలో ఉండే విధానాన్ని పూర్తిగా నిర్మూలించాలని అన్నాడు బ్రాహ్మణలు ఇరాన్ నుండి వలస వచ్చారని ఈ దేశ మూల నివాసులను శుద్రులుగా పరిగనించారని పూలే తెలియజేశాడు మనుషులంతా ఒక్కటే అని ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని అన్నారు పూలే పోరాట స్ఫూర్తితో ఎంతోమంది చైతన్యమయ్యారు ఈ సాంఘిక వ్యవస్థ మూలాన్ని ప్రక్షాళన చేయాలన్నదే పూలే ముఖ్య ఉద్దేశం అందుకుగాను నిన్న కులాల్లో ఉన్న అజ్ఞానాన్ని మూఢనమ్మకాలను నిరక్షరాస్యతను అపోహలను తొలగించి వారిని చైతన్యం వైపు నడిపించాడు పూలే

1882లో విలియం హంటర్ అధ్యక్షతన ఒక కమిటీ భారత దేశంలో పర్యటించి విద్య గురించి అధ్యయనం చేయడానికి వచ్చింది. ఈ కమిటీ దేశమంతటి పర్యటించి ప్రముఖులను కలిసి విద్యాభివృద్ధి గురించి చర్చించారు ఈ కమిటీలతో మాహాత్మ జ్యోతిరావు పూలే కూడా ఉన్నారు నిన్న కులాల వారు ప్రాథమిక విద్యను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు అందుకు కారణం పేదరికం మాత్రమే అని తెలియజేశాడు ఎప్పుడైతే ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యా విధానాన్ని ప్రవేశపెడుతుందో అప్పుడే నిన్న కులాలకు విద్య అందుతుందని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాడు ఆ విధంగా విద్య అభివృద్ధి గురించి కృషిచేసిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే

సత్యశోధక సమాజ్ స్థాపించి ప్రత్యామ్నాయ సంస్కృతికి నాంది పలికాడు

సత్యశోధక్ అంటే నిజాన్ని శోధించడం అని అర్థం

ప్రతి కార్యక్రమాల్లో బ్రాహ్మణల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు పూజారులు లేకుండానే పెళ్లిళ్లు చేయడం ప్రారంభించాడు ప్రజలకు దేవుడికి మధ్య పూజారి లేదా మత గురువుల అవసరం లేదని మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించాడు బ్రాహ్మణ దోపిడి వర్గం నుండి శూద్ర కులాలను రక్షించడానికి ప్రత్యామ్నాయ సంస్కృతికి కోసమే ఈ సత్యశోధక సమాజ్ ఏర్పాటు చేశాడు

మాత్మ జ్యోతిరావు పూలే దీనబంధు పత్రిక ద్వారా మరియు సేద్య గాని చర్నకోల లాంటి పుస్తకాలలో రైతులను ఉన్నత వర్గాల వారు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో రైతుల కష్టాన్ని గురించి వివరించాడు అలాగే గులాంగిరి అనే పుస్తకంలో దశావతారల గురించి ఇరాన్ నుండి వచ్చిన ఆర్యులకు ఈ దేశ మూలవాసులకు మధ్య జరిగిన యుద్ధాన్ని గురించి తెలియ చేశాడు ఎవరు దేవుళ్ళు వారు ఎందుకు దేవుళ్ళుగా పరిగణించబడ్డారు ఎవరు రాక్షసులుగా పరిగణించబడ్డారు అనే విషయాన్ని గురించి గులాంగిరి పుస్తకంలో వివరంగా తెలియజేశారు

మత గ్రంధాలు రాసిన వాళ్లందరూ మానవులే ఎంత వెతికినా అందులో సత్యం కానరాదు అని తెలిపారు

ఆ విధంగా భారతదేశంలో ముడోనమ్మకాల నిర్మూలనకు దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా మరియు శూద్రులకు వారి యొక్క అభివృద్ధికి కృషి చేసినందుకు గాను 1888లో మండే అనే ప్రాంతంలో ప్రజలంతా కలిసి పెద్ద ఉత్సవం నిర్వహించి మహాత్మా అనే బిరుదు తో జ్యోతిరావు పూలే ను సత్కరించారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోలిన తన గురువుగా ప్రకటించుకున్నారు అంటే పూల యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి

నేడు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే దానికి పూలే అంబేద్కర్ లాంటి మహనీయుల త్యాగాలు చాలా ఉన్నాయి
పూలే తాత్వికతను అవగతం చేసుకోవడానికి ఆయన రచనలను విశ్లేషించుకోవడం ప్రస్తుతం చాలా అవసరం వారి ఆలోచనలు తెలుసుకుని వాటిని మరింత ముందు తీసుకుని వెళ్ళడమే మనం వారి త్యాగానికి ఇచ్చే గౌరవం.

You may also like...

Translate »