ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి

ప్రొఫెసర్ కోదండరామ్ కి వినతి పత్రాన్ని అందజేసిన

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

జ్ఞాన తెలంగాణ, (కందుకూరు)

ఎన్ హెచ్ ఎం లో 510 జీవోలో అన్యాయం 4000 మందికి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ప్రొఫెసర్ కోదండరామ్ కి నేషనల్ హెల్తి మిషన్ జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అందజేశారు.510 జీ.ఓ. లో 4000 మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని పరిష్కారం కొరకు ప్రొఫెసర్  టిజేఏసీ చైర్మన్ కోదండరాం వినతి సమర్పించడం జరిగింది.


ఎన్ హెచ్.ఎం.కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు   2018 లో 510 జీఓలో కొంతమందికి అన్యాయం జరిగింది.కోదండరాం దృష్టికి తీసుకువచ్చారు. ప్రొఫెసర్ కోదండరాం 510 జీ.వో లో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని   510 గురించి వివరించనారు. 510 జీవోలో నష్టపోయిన 4000 కుటుంబాలకు వెలుగులు నింపాలని , చీకటిలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాన్ ఫై టెన్  జీవోను తయారుచేసి కోదండరాం సబ్మిట్ చేయడం జరిగింది.

ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయడానికి  కృషి చేస్తాననీ హామీ ఇవ్వడం జరిగింది.510 జీవో లో అన్యాయం జరిగిన వారికి వారందరికీ రెగ్యులర్ బేసిక్ ఉద్యోగల వేతనంతో పాటు, క్యాడర్ ఫిక్సేషన్ చేసి 2018 నుంచి అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి పల్లె దావఖన డాక్టర్స్ డిజిగ్నేషన్ చేంజ్ చేయగలరని మరియు వాళ్లకు పిఆర్సి 30% అందించాలని డాక్టర్ పుట్ట మహేందర్ రావు కోదండరామ్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ గౌడ్, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ జన్ను కోర్నల్,లోకేష్ ,ఆయుష్  ప్రెసిడెంట్ శ్రీనివాస్ ,పల్లె దావఖన వైద్యాధికారి డాక్టర్ పుట్ట మహేందర్ రావు,దామల ప్రవీణ్ ,బాలరెడ్డి,ఫార్మసిస్ట్ నవ కాంత్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 

You may also like...

Translate »