టీడీపీలోకి చేరిన కోడికత్తి శీను

జగన్ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన
జగన్పై హత్యాయత్నం కేసులో బెయిల్పై విడుదలైన కోడికత్తి శీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు.
జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు.
తన విడుదలకు కారణమైన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని పార్టీల మద్దతు లభించినా తాను అభిమానించిన వైసీపీ నుంచి మాత్రం ఎవరూ సహకరించ లేదని అన్నారు. తాను బతికి ఉండటానికి కారణం ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలేనని అన్నారు.