కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 మంది గట్ల కానాపురం గ్రామస్తులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 మంది గట్ల కానాపురం గ్రామస్తులు
జ్ఞాన తెలంగాణ ,పెద్ద మందడి మండలం మే 1; పెద్దమందడి మండలం గట్ల కానాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పద్మా విద్యాధర్, బ్యాంకు కృష్ణయ్య ,గురాల మనెంకొండ తో పాటు మరో 40 మంది బి.అర్.యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామ ఎంపీటీసీ దామోదర్, మాజీ సర్పంచ్ వెంకటేష్ ల ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే గారి నివాసం తిరుమల హిల్స్లో ఏర్పాటుచేసిన చేరికల కార్యక్రమంలో వీరికి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మీరంతా పార్టీ బలుపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, మహేష్, శేఖర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు