కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘనపూర్ శివునిపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు

జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్: కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘనపూర్ శివునిపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు–కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి డా. కడియం కావ్య*రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమే ఈ చేరికలు అని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారు అన్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి మరియు గ్రామానికి చెందిన సుమారు 100మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు హన్మకొండలోని ఎమ్మెల్యే గారి నివాసంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కడియం కావ్య గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. తనని నమ్మి వచ్చే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అందరూ కలిసి కట్టుగా పని చేసి మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.పార్టీలో చేరిన వారిలో ఎంపిటిసిలు బర్ల శంకర్, గుర్రం రాజు ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి గుర్రం రాజ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నీల రమేష్, మాజీ సర్పంచ్ గుర్రం దేవయ్య, సుధీర్, రంజిత్, కృష్ణ, సమ్మయ్య, శ్రీనాథ్, అరుణ, సుజాత, సునీత, సరితలతో పాటు సుమారు 100మంది నాయకులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »