బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఙ్ఞాన తెలంగాణ ,నారాయణపేట టౌన్ ,మే 1:నారాయణ పేట జిల్లాలోని దామరగిద్ద మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ గట్టి తగిలింది. ఆ పార్టీ మండల అధ్యక్షులు ఆశన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. నారాయణపేట సీవీఆర్ భవన్ లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన కొద్దీ సేపటికే ఆయన పార్టీని వీడారు. గతంలో పార్టీ కోసం చాలా పని చేశానని నన్నెవరూ గుర్తించలేదని చెప్పారు.శివకుమార్ రెడ్డి తన అడుగు జాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు.ఉల్లిగుండం మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి పార్టీలో చేరారు.

You may also like...

Translate »