టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు:

టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు:
జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 5:నారాయణ పేట జిల్లాలోని ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి ఉప సర్పంచ్, రెండవ వ, నాలగవ వ, ఆరవ వార్డు సభ్యలు, 40 మంది నాయకులు మరియు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బి ఆర్ యస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో ముందంజలో ఉందని రాష్ట్రం సాధించిన బిఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని ఇతర పార్టీలకు తావులేదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా సియం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు వేసి దొంగ ప్రమాణాలు చేస్తున్నారు కాని రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరు అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..