హైదరాబాద్ లో నిరుద్యోగులకు ఉద్యోగ మెళ

హైదరాబాద్ లో నిరుద్యోగులకు ఉద్యోగ మెళ
అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి జయశ్రీ
జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)హైదరాబాద్ నిరుద్యోగులు ఉద్యోగ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.సోమవారం హైదరాబాద్ లో ఉపాధి కల్పన కార్యాలయ అధికారులు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేట్ రంగం లోఉద్యోగములు కల్పించేందుకు తేదీ 12 -06- 2024 బుధవారం ఉదయం 10-30 నుండి 2-30 గంటల వరకు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ,శివం రోడ్, అపోజిట్ శివం టెంపుల్ విద్య నగర్ హైదరాబాద్ నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని అని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి జయశ్రీ అన్నారు.హైదరాబాద్ లో రిటైల్ ఈ – కామర్స్, ఐ టి, బి పీ ఓ, హెల్త్ సెక్టార్ రంగాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐ టి ఐ , డి ప్ల మా, బి టెక్ , ఏ ఎన్ ఎం ,జి ఎన్ ఏం,బి ఎస్సీ నర్సింగ్ ఉండాలని ఐతే వయసు 18 ఏళ్ల నుంచి30 లోపు ఉండాలని అన్నారు.మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు 9063099306, 8977175394 సంప్రదించాలని కోరారు.