సివిల్స్‌లో సత్తాచాటిన జైపూర్ ఏసీపీ కుమారుడు

సివిల్స్‌లో సత్తాచాటిన జైపూర్ ఏసీపీ కుమారుడు
మంచిర్యాల జిల్లా/
ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతి ఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు అని నిరూపించాడు జైపూర్ ఏసీపీ.వెంకటేశ్వర్ కుమారుడు.విశాల్ మంగళవారం యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 718 వ ర్యాంకు సాధించాడు.జైపూర్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్-అనవాల దంపతుల కుమారుడు విశాల్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్ టీ పీ సీ లోని సెంటీ క్లైర్ స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకున్నాడు.తరువాత మెదక్ జిల్లా తుఫ్రాల్ అభ్యాస రెసిడెన్సియల్ స్కూల్లో 10 వ తరగతి వరకు చదువుకొని హైద్రాబాద్ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు,ఉత్తర ఖాండ్ లోని రూర్కి లో ఐఐ టీ కాలేజిలో సివిల్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ లుగా ఆత్రపాలజీని తీసుకొని 2020 లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.కోచింగ్ తీసుకుంటూ రెండు సార్లు సివిల్స్ అటెంప్ట్ చేసి నిరాశపడకుండా చదివి మూడవ సారి ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు.
చాందా గ్రామం స్ఫూర్తి తోనే….

విశాల్ తల్లిదండ్రులది సొంత గ్రామం ఆదిలాబాద్ రూరల్ చాందా తుర్కల్ కాగా తండ్రి.వెంకటేశ్వర్ ప్రస్తుతం జైపూర్ ఏసీపీ గా విధులు నిర్వహిస్తున్నారు.చాందా గ్రామంలో ఉన్న 3 వేల మందిలో 500 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని , చాందా గ్రామం స్ఫూర్తి తోనే సివిల్స్ సాదించాడని విశాల్ విశాల్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.