ఉత్తరాసి పల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న బుద్దుల జంగయ్య

ఉత్తరాసి పల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న బుద్దుల జంగయ్య
కొందుర్గు: కొందుర్గు మండల పరిధిలో ఉత్తరాస్ పల్లి గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశం దగ్గరికి వెళ్లి వివరాలు తెలుసుకొని మాట్లాడుతున్న బుద్ధుల జంగయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా కూలీలు పనులు చేస్తూ ఉన్న రెండు వారాల కూలి డబ్బులు మాత్రమే కూలీల అకౌంట్లో పడ్డవి మిగతా నాలుగు వారాల డబ్బులు ఇంతవరకు వాళ్ళ అకౌంట్ లో పడలేదని అధికారులు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు ఎన్నో పోరాటాలు చేస్తే 2005లో యూపీఏ ప్రభుత్వం మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వచ్చింది 2013 వరకు బ్రహ్మాండంగా నడిచిన ఉపాధి పథకం ఉపాధి కూలీలకు ఎంతో మేలు జరిగింది అని ఆయన తెలిపారు
2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకానికి సరైన నిధులు కేటాయించక నత్తనడకన ఉపాధి హామీ పథకం నడుస్తున్న పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ఉపాధి కూలీలు ఉపాధి పథకంలో లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంది అలాంటి ఈ పథకాన్ని రోజురోజుకు నిర్వీర్య పరుస్తూ సరైన నిధులు కేటాయించక నత్తనడకన ఉపాధి పనులు నడుస్తున్న పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉపాదిహమి పథకం పట్ల మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని అందుకే ఉపాధి పథకంలో ఉన్న వసతులను నీళ్లు నీడకు టెంటు రవాణా సౌకర్యం పనిచేయడానికి పారా గడ్డపార గంప లాంటివి ఏవి ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారని అయినా ఉపాధి కూలీలు ఎర్రటి ఎండలో పనులు చేస్తున్నారు వారికి కూలి గిట్టుబాటు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొలుతలతో సంబంధం లేకుండా రోజు కూలి 600 ఇవ్వాలని 200 రోజులు పనులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఉపాధి హామీ కూలీలకు 400 రోజు కూలి ఇస్తామని వాళ్ల మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి కి ఓటు వేయ్యలని ఉపాధి కూలీలను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల
అధ్యక్షుడు లు భాగాల నరసింహ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వడ్డే జంగయ్య చంద్రయ్య రాములమ్మ నీలమ్మ పోచమ్మతదితరులు పాల్గొన్నారు.. కేపీ