కంపు కొడుతుంది

జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ జూన్ 5:-

మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామ శివారులో గ్రామ రెవెన్యూ లోని చెత్తను సమాకూర్చి ఒక పాడు పడ్డ బావి దగ్గర వేస్తూ ఆ స్థలాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చారు. అంతే కాకుండా అక్కడ ఉన్న చెత్తను కాల్చేస్తున్నారు తద్వారా పెద్ద ఎత్తున పొగలు అలుమూకొని దానికి తోడుగా దుర్వాసన చుట్టూ ప్రక్కల మొత్తం బయలువెలుతుంది. అయితే ఆ బావి దగ్గరలోనే ఉన్న ప్రార్థన స్థలం దగ్గరకు ఆ దట్టమైన పొగ మరియు దుర్వాసనతో అక్కడికి వచ్చే భక్తులు ఇబ్బందికి గురవుతున్నారు. కావున దయచేసి డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి వేరే స్థలానికి తరలించాలని కోరుతున్నారు.

—- డంపింగ్ యార్డ్ ఇబ్బందుల కొరకు చాలా మంది మార్చాలని కోరారు. పక్కనే ప్రార్థన స్థలం ఉన్నందున తప్పకుండ అక్కడ నుండి వేరే స్థలానికి డంపింగ్ యార్డ్ ను తరలిస్తాం. మరియు అక్కడ చెత్త వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.

You may also like...

Translate »