ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కెఎస్ రత్నం

తెలంగాణ బీజేపీ బలోపేతంలో ఈటెల రాజేందర్ కీలక భూమిక పోషించాడని వెల్లడి


జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, చేవేళ్ల బీజేపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ కెఎస్ రత్నం ప్రత్యేకంగా శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈటెల రాజేందర్ బీజేపీకి మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రజలకు కూడా ధైర్యంగా నిలబడే నేత. ఆయన నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతం అవుతోంది. గడచిన కాలంలో ఆయన ఎలాంటి ఒత్తిడులకూ తలొగ్గకుండా ప్రజల కోసం పోరాడారు. అదే నిజమైన ప్రజానాయకుడి లక్షణం. భవిష్యత్తులో ఆయన మార్గదర్శకత్వంలో బీజేపీ మరింత బలపడాలని ఆశిస్తున్నాను” అని కొనియాడారు.ఈటెల రాజేందర్ రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ముఖ్యంగా నిబద్ధత, ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీకి విశ్వసనీయత వంటి అంశాల్లో ఆయన అందరికీ ఆదర్శమని కెఎస్ రత్నం అన్నారు. బీజేపీని తెలంగాణలో మరింత బలంగా స్థాపించడంలో, సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో ఆయన కృషి అమోఘమని పలువురు బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ బసగళ్ల రాముల గౌడ్, జిల్లా దిశ అభివృద్ధి కమిటీ సభ్యులు, మోయినాబాద్ ప్రభాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎల్ ప్రభాకర్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు లిలావతి బయ్యన్న, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాసుదేవ్ కన్నా, మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దాయకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, ప్రతాప్ రెడ్డి, గాజులగూడెం నర్సింలు, గాలయ్య శ్రీకాంత్, హరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »