ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం..!!

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం..!!

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు.సీఎం అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్‌ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు.

You may also like...

Translate »