ఇందూర్ హైస్కూల కు ఇంటర్నషనల్ బ్రిలియన్స్ అవార్డ్.


–“బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ – 2024” గా ఇందూర్ హైస్కూక్ .
ఫోటో .అవార్డుతో కొడాలి కిశోర్ కుమార్.
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లిలో గల ఇందూర్ హైస్కూల్ కు ఇంటర్నేషనల్ బ్రిలియన్సీ అవార్డు -2024 (బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్) వచ్చిందని ఇందూర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ కొడాలి కిశోర్ కుమార్ తెలిపారు.గురువారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ఇందూర్ హైస్కూల్ గత 15సంవత్సరాలుగా బెస్ట్ ఎవలబుల్ స్కుల్ గా ప్రభుత్వంతో భాగస్వామ్యంఅయి విద్యాబోధన అందించిందని తెలిపారు. పాఠశాలలో ఎన్ సీసీ, స్కౌట్, అటల్ టింకరింగ్ ల్యాబ్ కలిగి అధునాతన సౌకర్యాలు ఉన్నాయని అన్నారు . ఎన్ సీసీ విభాగంలో నేషనల్ పరేడ్ కు రెండు పర్యయాలు ఎన్నికవ్వడం జరిగిందన్నారు. అలాగే సైన్స్ ఫెయిర్ లో జాతీయ స్థాయి బహుమతులను పొందినట్లు తెలిపారు. పాఠశాల నిర్వహణలు మేనేజ్ మెంట్ , ఉపాధ్యాయుల అంకితభావం, పాఠశాల క్రీడా మైదానం, వినూత్న పద్దతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అంశాలను పరిగణలోకి తీసుకొని న్యూడిల్లీకి చెందిన హై ప్లెడ్జి మీడియా గ్రూప్ వారు 2024 ఏప్రిల్ 20న ఇందూర్ పై స్కూల్ ను ఇబీఏ (ఇంటర్నేషనల్ బ్రిలియన్స్ అవార్డు -2024) కు ఎంపిక చేసిందని పేర్కోన్నారు. ఈ అవార్డును పోస్ట్ ద్వారా సోమవారం పంపించినట్లు తెలిపారు.
తమ పాఠశాలకు అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, దీనికి సహకరించిన విద్యార్థుల తల్లి దండ్రులకు, ఉపాద్యాయ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...

Translate »