ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిశీలన

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిశీలన
జ్ఞాన తెలంగాణ, బాలాపూర్:
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నాలుగు కోట్ల రూపాయల నిధులు వేచించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మిస్తున్న పనులను మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి పరిశీలించారు. సదరు కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నియోజకవర్గంలో మొత్తం నాలుగు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు కాగా అందులో రెండు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయని ఒకటి బడంగ్పేట్ రెండోది తుక్కుగూడ ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మార్కెట్ ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.