ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ


జ్ఞాన తెలంగాణ, ఇల్లంతకుంట:


శనివారం రోజున ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకొని నేరాల నియాత్రణకు కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు ,సిబ్బంది విధులు నిర్వహించాలని, బ్లూకోట్స్‌ ,పెట్రో కార్ సిబ్బంది 24 గంటలపాటు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించారు.

పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని,విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచన లు ఇవ్వడం జరిగింది

You may also like...

Translate »