పాఠశాల మరమ్మత్తు పనులను పరిశీలించిన

పాఠశాల మరమ్మత్తు పనులను పరిశీలించిన
మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని కుర్మల్ గూడా జన్నురం కాలనిలో త్వరలో ప్రారంభించనున్న ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మరమ్మత్తులు పనులను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పరిశీలించారు. ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలను ప్రారంభించడానికి సహకరించిన ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కి,విద్యాధికారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మంత్రి సితక్క తో గతంలో అంగన్ వాడి కేంద్రం గురించి కూడా మాట్లాడడం జరిగింది అని అలాగే అక్కడ అంగన్ వాడి టీచర్ ని కేటాయించేందుకు కృషి చేస్తామని అన్నారు.పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లలేక కొంత మంది చదువు మధ్యలోనే వదిలేసే పరిస్థితులు ఉండేవని అందుకే పిల్లలకు ఇక్కడ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఇఓ కృష్ణయ్య, డీఈఈ జ్యోతి రెడ్డి, నాయకులు భద్రమోని రమేష్, ఆనంద్ రెడ్డి, టి మల్లారెడ్డి, జంపయ్య, సాదిక్, కుమారి, మైన, హరి, జహంగీర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు..
