ఈదురు గాలుల దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన

మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, (భూదాన్ పోచంపల్లి)

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం
ధర్మారెడ్డి పల్లి గ్రామంలో ఈదురు గాలుల దెబ్బతిన్న ఇండ్లను మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పరిశీలించారు.
జరిగిన నష్టాన్ని ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజలకు జరిగిన నష్టపరిహారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి వచ్చే విధంగా చూస్తానని ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అన్నారు. ఎవరు ఇబ్బంది పడకూడదు అని ధైర్యంగా ఉండాలని విధాలుగా అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. బాధిత కుటుంబాలకు తన వంతు ఆర్థిక సాయం అందజేస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి, శ్రీశైలం గౌడ్, మాజీ సర్పంచ్ మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సామ రవీందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కాటం రాజు గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »