భూ వివాదంలో మారణ ఆయుధాలతో విచక్షణ రహితంగా దాడి

  • ప్రాణాపాయ స్థితిలో బాధితుడు గుగులోతు వీరన్న జ్ఞాన తెలంగాణ జూన్ 15, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: భూ వివాదంలో మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రాణాపాస్థితిలో యువరైతు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉన్నత విద్యను అభ్యసించి తనకున్న భూమిలో వ్యవసాయం పండించేందుకు యువ రైతు ఆరాటపడుతున్న సమయంలో పక్క చేను గెట్టు వారి మధ్య వివాదం చెలరేగి మారణాయుధాలతో దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని బాలాజీ నగర్ తండా గ్రామపంచాయతీ లో చోటుచేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వెదుళ్ల చెరువు రెవెన్యూ పరిధిలో గుగులోతు వీరన్నకి తన తండ్రి ద్వారా వచ్చిన వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఇట్టి క్రమంలో పక్క చేనుగెట్టు రైతులు వీరన్న గెట్టు ను ధ్వంసం చేయగా వీరన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాసిల్దార్ కార్యాలయంలో మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి సూచించగా ఎస్ఐ మాటలు పట్టించుకోకుండా అదే గ్రామానికి చెందిన ధరావత్ రామచంద్రు ధరావత్ నాగరాజు ధరావత్ వెంకన్న ధరావత్ పంతులు సరోజ మహేష్ వీరన్న పై నువ్వు మాపై అక్రమ కేసులు పెట్టావని దౌర్జన్యంగా మారన ఆయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరన్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆటో ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు బాధితులు పోలీస్ స్టేషన్లో సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా విన్నవించగా దౌర్జన్యంగా దాడి చేసి ఎప్పటికైనా నిన్ను చంపుతామని బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నాడు వీరన్న పై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించి హత్య ప్రయత్నం కింద కేసు నమోదు చేసి బాధ్యుడికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

You may also like...

Translate »