ఆసియా క్రీడల్లో మనకు మరో పసిడి.

ఆసియా క్రీడల్లో మనకు మరో పసిడి.
ఆసియా క్రీడల్లో 2023 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సరబ్‌జోత్ సింగ్ శివ నర్వాల్ అర్జున్ సింగ్ చీమా మొత్తం 1734 స్కోరు సాధించి స్వర్ణం గెలుచుకున్నారు.
వారి అద్భుతమైన ఆటతీరుతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో చైనాను ఓడించి టీం స్వర్ణం సాధించారు.
వియత్నంతో పటిష్ట ప్రదర్శన చేసి 1730 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది 580 పాయింట్లు సాధించిన సరబ్జోత్ ఐదో ర్యాంక్ సాధించగా అర్జున్ 578 పాయింట్లతో వ్యక్తిగత క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
వీరిద్దరూ నేడు జరగనున్న పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో పోటీ పడనున్నారు దీంతో ప్రస్తుత ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 24వ పతకం, షూటింగ్‌లో నాలుగో బంగారు పతకం లభించింది.