దర్జాగా అక్రమ నిర్మాణాలు

దర్జాగా అక్రమ నిర్మాణాలు
జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ ప్రతినిధి
…నర్కుడలో భారీ షెడ్ల నిర్మాణాలు
…పలుసార్లు అధికారులు ఆపిన ఆగని కట్టడాలు
…111 జి ఓ కు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని నర్కుడ గ్రామ పరిధిలో భారీ షెడ్ల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుసార్లు ఈ కథనం వార్తా పత్రిక ద్వార ప్రచూరం అయినప్పటికీ అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పనులు ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు వెళ్లి పనిని ఆపడం ఆ తర్వాత మళ్లీ యధావిధిగా పని కొనసాగించడం ఈ విధంగా పలుసార్లు అధికారులు వెళ్లి ఆపివేసిన తిరిగి ప్రారంభించడానికి గల కారణాలు తెలియాలని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు అధికారుల నిర్లక్ష్యమా అక్రమార్కుల మొండితనమా అని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు అధికారులు వెళ్లి చర్యలు తీసుకోవడం తిరిగి షెడ్ల నిర్మాణం జరగడం కొనసాగుతూ వస్తుంది ఈ తంతు చాలా రోజులుగా కొనసాగుతూ చివరకు షెడ్ల నిర్మాణాలు సైతం పూర్తి దశలోకి రావడం ఎంతో విచారం
అధికారులు పూర్తి గా నిర్మాణాలను ఆపివేసి కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు . అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ దృష్టికి ఈ అక్రమ నిర్మాణాల తంతు తీసుకెళ్ళాలని ప్రజలు అనుకుంటున్నారు.
